టీమిండియా సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహాకు ఓ జర్నలిస్టు నుంచి బెదిరింపులు ఎదురైన విషయంలో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఎ) స్పందించింది. వెటరన్ వికెట్‌కీపర్ సాహాకు వచ్చిన బెదిరింపులు సందేశాన్ని తాము ఖండిస్తున్నట్లు ఐసీఎ వెల్లడించింది. ఈ వ్యవహారంలో విచారణ జరపాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగితిస్తున్నామని ఐసీఎ తెలిపింది. క్రికెట్ అభ్యున్నతికి క్రికెటర్ల ఎదుగుదలలో మీడియా పాత్ర ఎంతో ప్రధానమైందని పేర్కొంది. అయితే సదరు జర్నలిస్టు హద్దు దాటాడని భావిస్తున్నామని ఐసీఎ స్పష్టం చేసింది. సాహా విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పాత్రికేయ సంఘాలకు దీనిపై సమాచారం అందించామని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరామని ఆటగాళ్ల సంఘం ప్రకటనలో తెలిపింది. ఈ అంశంలో మీడియా కూడా సాహాకు మద్దతు ఇవ్వాలని ఐసీఎ కార్యదర్శి హితేశ్ మజుందార్ పేర్కొన్నారు.
అయితే మరోవైపు ఈ అంశంపై సాహా మాట్లాడుతూ విచారణలో భాగంగా బీసీసీఐ కోరినా తనను బెదిరించిన జర్నలిస్టు పేరు చెప్పను అన్నాడు. సదరువ్యక్తి కెరీర్‌ను నాశనం చేయడం తన ఉద్దేశ్యం కాదని సాహా స్పష్టం చేశాడు. తన తల్లిదండ్రులు ఆవిధంగా తనను పెంచలేదన్నాడు. పేరు చెప్పే ఉద్దేశ్యం ఉంటే టీట్‌లోనే పేర్కొనేవాడిని అని తెలిపాడు. కాగా శ్రీలంకతో సదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌కు సాహాకు చోటు దక్కలేదు. ఈ విషయంపై సాహా (37) మీడియాతో మాట్లాడుతూ హెడ్ కోచ్ ద్రవిడ్ తనను దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిందిగా సలహా ఇచ్చాడని తెలిపాడు. గంగూలీ నుంచి మద్దతు ఉన్నా జట్టులో స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో ద్రవిడ్ మాట్లాడుతూ సాహా అంటే గౌరవం ఉంది. అభిప్రాయాలు ఏకీభవించని కారణంగా ఇతరులను తప్పు పట్టకూడదని సూచించాడు. అయితే బెంగాల్ వికెట్‌కీపర్ సాహా భారతజట్టులో అతడి స్థానంపై స్పష్టతనివ్వాలని ద్రవిడ్ సూచించాడు. రిషభ్‌పంత్ తనను నంబర్‌వన్ వికెట్‌కీపర్,బ్యాటర్‌గా నిరూపించుకున్నందునే సాహాకు అవకాశం దక్కలేదని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. మరోవైపు యువ వికెట్‌కీపర్ కేఎస్ భరత్ తనను తాను నిరూపించుకుంటున్న క్రమంలో సాహాతో ఆ విధంగా మాట్లాడాను అని వివరించాడు. కాగా సాహా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించడన్న కారణంతో ఓ జర్నలిస్టు బెదిరింపులకు పాల్పడ్డాన్న ఆరోపణలపై విచారిస్తున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపాడు. మరోవైపు సాహాకు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్‌సింగ్ తమ మద్దతు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..