Tuesday, November 26, 2024

ఐఏఎస్‌ల సేవలు దేశాభివృద్ధిలో కీలకం : మోదీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సామాన్యులకు ప్రభుత్వ సేవలను అందజేయగలిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రధానమంత్రి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2021 సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. గురువారం ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నరేంద్రమోదీ మహాత్మ గాంధీ, వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడారు. ఐఏఎస్‌ల సేవలు దేశాభివృద్ధిలో కీలకమన్న ఆయన, కార్యదర్శులు కష్టపడి పని చేస్తేనే జిల్లా, ఆ తర్వాత దేశం ప్రగతిబాట పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఏఎస్‌లకు ప్రధాని అవార్డులను ప్రదానం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement