ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ కి కేంద్ర మాజీ మంత్రి..బిజెపి సీనియర్ నేత మేనకా గాంధీ మద్దతు ఇచ్చారు. ఆయనను లద్దాఖ్‌కు బదిలీ చేయడం ఢిల్లీ ప్రభుత్వానికే పెద్ద నష్టమన్నారు. వ్యక్తిగతంగా ఆ ఐఏఎస్ అధికారి తనకు బాగా తెలుసని, ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అన్నారు. ఆయన పర్యావరణ శాఖకు కార్యదర్శిగా ఉన్న సమయంలో, ఆయన చేపట్టిన చర్యల వల్ల ఢిల్లీ ఎంతో లాభపడిందని, ఆయనపై తీసుకున్న చర్యలు తప్పని మేనకా గాంధీ అన్నారు.కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్ సాయంత్రం వేళ పెంపుడు కుక్కతో కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే త్యాగరాజ స్టేడియానికి వాకింగ్‌కు వెళ్లేవారు.అయితే దీని కోసం స్టేడియం సిబ్బంది క్రీడాకారులను రాత్రి ఏడు గంటలకు ముందుగానే ఖాళీ చేయించేవారు. ఈ ఉదంతంపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్‌ను లడఖ్‌కు, ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement