ఇకపై రొమాంటిక్ మూవీలు చేయనని..రొమాంటిక్ మూవీస్ చేసీ చేసీ విసుగుచెందానని తెలిపాడు బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్.. ఇప్పుడు మారిన ట్రెండ్‌కు, తనకున్న ఇమేజ్‌కు లవ్‌స్టోరీస్ సెట్ కావని ఆయన అన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక నుంచి మాట్లాడుతూ.. ఆయన ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం తాను లవ్ రంజన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నానని. ఇక ఇదే నా చివరి రోమ్ కామ్ అని చెప్పారు రణ్ బీర్. ఇకపై ఈ తరహా సినిమాల్లో నటించను. నా వయసు, ఇమేజ్ చూస్తే ఇక లవ్‌స్టోరీస్ వద్దనిపిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా తండ్రినయ్యాను. నా పిల్లలకు ఇరవై ఏండ్లు వచ్చేప్పటికి నేను అరవైలో పడతాను. అప్పుడు నా పిల్లలతో కలిసి ఆటలాడలేను, పరుగులుపెట్టలేనేమో అనిపిస్తున్నది అని సరదాగా వ్యాఖ్యానించారు రణ్ బీర్.