టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లీ 100వ టెస్టులో సెంచరీ కొడితే.. మ్యాచ్ చూసేందుకు వస్తానని చెప్పుకొచ్చాడు. కోహ్లీతో కలిసి తాను ఆడలేదని, అయినా అతని ఆట అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఫాంలోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన గంగూలీ.. మీడియాతో మాట్లాడాడు. కోహ్లీతో విభేదాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశాడు. 100వ టెస్టు ఆడటం అంత సులభం కాదన్న గంగూలీ.. అతి కొద్ది మందికి ఇది సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. ఈ స్థాయికి వచ్చాడంటూ ప్రశంసించాడు. కోహ్లీ టెక్నిక్, ఆటపట్ల సానుకూల దృక్పథం, ఫుట్ వర్క్ ఇలా ఎన్నో అంశాలు కోహ్లీలో నచ్చుతాయంటూ వివరించాడు.
కోహ్లీ ఆడుతున్న ప్రతీసారి ఆటను గమనిస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ విఫలం అయ్యాడని, ఆ మ్యాచ్‌కు తానే కామెంటేటర్‌గా వ్యవహరించినట్టు గంగూలీ తెలిపాడు. ఆ తరువాత అతని ఆట ఎంతో అద్భుతంగా కొనసాగిందని కొనియాడాడు. రాహుల్, సచిన్ లాంటి దిగ్గజాలందరూ.. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కినవారే అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కొంత ఫామ్‌లో లేడన్న గంగూలీ.. త్వరలోనే కోహ్లీ శతకం బాది మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్లుగా ఒక్క శతకం బాదకపోయినా.. కీలక ఇన్నింగ్స్‌లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడి కొనియాడాడు. టెస్టుల్లో సచిన్ స్థానంలో ఆడున్నంత మాత్రాన మాస్టర్ బ్లాస్టర్‌తో పోల్చలేమని స్పష్టం చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..