Tuesday, November 26, 2024

12 నుంచి ఐ-లీగ్‌.. కేర‌ళ‌లో నిర్వ‌హిస్తున్న ఫుట్‌బాల్ స‌మాఖ్య‌

2022-23 ఐ-లీగ్‌ టోర్నమెంట్‌ నవంబర్‌ 12 నుంచి కేరళలోని మలప్పురం వేదికగా నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వెల్లడించింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ గోకులమ్‌ కేరళ జట్టు రన్నరప్‌ మొహమ్మదన్‌ స్పోర్టింగ్‌ జట్టుతో తలపడనుంది. గత రెండు సీజన్‌లు లీగ్‌ టోర్నమెంట్లు బయో బబుల్‌ విధానంలో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, కల్యాణి, నయిహటి వేదికగా మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే. కొవిడ్‌ ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో ఈసారి టోర్నమెంట్‌లో 12 ఫుట్‌బాల్‌ జట్లు పాల్గొంటున్నాయి.

దేశవ్యాప్తంగా 13 వేదికలుగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్స్‌ గోకులం కేరళ జట్టు స్వస్థలం మలప్పరం(కేరళ)లోని పయనాడ్‌ స్టేడియంలో ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లు కోజికోడ్‌లోని ఈఎంఎస్‌ స్టేడియంలో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. డెక్కన్‌ అరెన (హైదరాబాద్‌), ఛత్రశాల్‌ స్టేడియం (న్యూఢిల్లిd), బక్షి స్టేడియం (శ్రీనగర్‌)లతోపాటు ముంబై, రాజస్థాన్‌లోని అంబేద్కర్‌ స్టేడియం, కెంక్రీ తదితర మైదానాల్లో మ్యాచ్‌లు జరుగుతాయని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ఒక ప్రకటనలో వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement