Wednesday, November 20, 2024

టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా రూ.10 లక్షల సాయం

ఇటీవల కరోనాతో మృతి చెందిన ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ గతంలో ఐ డ్రీమ్ యూట్యూబ్ చానల్ కోసం అనేకమంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు. ఐ డ్రీమ్ పాప్యులారిటీ పెంచడంలో తనవంతు శ్రమించారు. తమ సంస్థ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన టీఎన్ఆర్ ఇప్పుడు తమ మధ్య లేకపోవడం పట్ల ఐ డ్రీమ్ మీడియా సంస్థ ఛైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన టీఎన్ఆర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల చెక్ ను టీఎన్ఆర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.


టీఎన్నార్ పిల్లలను చదివించే బాధ్యతను కూడా తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. టీఎన్ఆర్ ఐ డ్రీమ్ సంస్థలో ఉద్యోగి మాత్రమే కాదని, తనకు సన్నిహితుడు అని వాసుదేవరెడ్డి తెలిపారు. సంస్థ ఎదుగుదలకు విలువైన సూచనలు, సలహాలు అందించాడని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, టీఎన్నార్ పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని, వారికి అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వాసుదేవరెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement