నేను ప్రెగ్నెంట్ అయినట్లు కొందరు వార్తలు సృష్టించి వైరల్ చేస్తున్నారు..ప్లీజ్ నా డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండని కోరింది నటి నిక్కీ గల్రానీ.. కాగా హీరో ఆది పినిశెట్టి , హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆది-నిక్కీ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని, నిక్కీ గల్రానీ ప్రెగ్నెంట్ అంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. టాలీవుడ్లోనే కాదూ కోలీవుడ్లో సైతం ఈ వార్త హల్చల్ చేసింది. ఈ రూమర్లపై తాజాగా నిక్కీ గల్రానీ తనదైన శైలిలో స్పందించింది. అవన్నీ వదంతులే అని కొట్టిపారేసింది. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. ఈ వార్తను భవిష్యత్తులో తప్పకుండా బ్రేక్ చేస్తా. దయజేసి రూమర్లను వ్యాప్తి చేయకండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో పోస్టు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement