గత పది రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు మాత్రం రష్యా ఒక ఐదు గంటల పాటల యుద్దానికి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రష్యా భీకర దాడులను ఎదుర్కొంటోంది ఉక్రెయిన్. లక్షలాది మంది రష్యా సైనిక కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఉక్రేనియన్లు కూడా గన్నులు పట్టారు.రష్యా దాడిని తిప్పికొట్టే ఉద్దేశంతో 18 నుంచి 60 ఏళ్లు ఉన్న పురుషులు దేశాన్ని విడిచి వెళ్లరాదని ఉక్రెయిన్ ఆదేశించిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు కూడా కదనరంగంలోకి దిగుతున్నారు. రకరకాల ఆయుధాలను వాడుతున్నారు. ఆత్మరక్షణ కోసం రైఫిళ్లను వినియోగిస్తున్నారు. వెస్ట్రన్ ఉక్రెయిన్‌లో ఉన్న లివివ్ నగరంలో ఓ మహిళ ఎలా ఏకే-47 అజాల్ట్ రైఫిల్‌ను వాడాలో నేర్చుకుంటోంది. దూసుకువస్తున్న రష్యా సైనిక పటాలాన్ని తిప్పికొట్టేందుకు విదేశాల్లో ఉన్న ఉక్రేనియన్లు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. విదేశాల్లో ఉన్న 66,224 మంది ఉక్రేనియన్లు తిరిగి స్వదేశానికి వచ్చినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. రష్యా దాడి నుంచి మాతృదేశాన్ని రక్షించుకునేందుకు స్వంత పౌరులు వస్తున్నట్లు ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital