Friday, October 18, 2024

HYDRAA – ఇక అక్రమ కట్టడాలకు మేమే నోటీస్ లు జారీ చేస్తాం .. రంగనాథ్

హైదరాబాద్‌: మహా నగరంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

అనధికారిక భవనాల కూల్చివేత అధికారం కూడా హైడ్రాకు లభించిందన్నారు. నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్‌ఎంసీ చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ పురపాలకశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

.ఆ ఉత్తర్వులపై స్పందించిన కమిషనర్‌ రంగనాథ్‌.. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయన్నారు. ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే కూల్చివేతలు, స్వాధీనం సహా తదితర అధికారాలన్నీ హైడ్రాకు లభించాయని రంగనాథ్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల హైడ్రా మరింత బలపడిందన్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారం, ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 27 మున్సిపాలిటీలకు పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందని తెలిపారు.

- Advertisement -

తాజా ఉత్తర్వులతో రానున్న రోజుల్లో అక్రమ నిర్మాణాల పాలిట హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల కొన్ని నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టుల నుంచి యథాతథ స్థితి కొనసాగించాలన్న ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement