Tuesday, September 17, 2024

HYDRAA – మాదాపూర్, అమీన్‌పూర్‌, మల్లంపేటలలో ఆక్రమణలు కూల్చివేస్తున్న హైడ్రా

హైదారాబాద్ – మాదాపూర్,అమీన్‌పూర్‌, మల్లంపేటలలో ఆక్రమణల కూల్చి వెతలను నేటి ఉదయం హైడ్రా చేపట్టింది మాదాపూర్ లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అలాగే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణినగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నిర్వహిస్తున్నారు .. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

.

- Advertisement -

కాగా, కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం.. దుండిగల్ మల్లంపేట కత్వ చెరువు స్థలంలో శ్రీలక్ష్మిశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించింది. దీంతో విల్లాల కూల్చివేతకు సిద్ధమైంది హైడ్రా.. శ్రీలక్ష్మిశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చి వెతలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement