Saturday, November 23, 2024

హైదరాబాద్‌లో మొదటి ఫ్లైట్ రెస్టారెంట్‌.. డిసెంబర్‌లో ప్రారంభించనున్న పిస్తా హౌస్

హైదరాబాద్ లోని ప్రముఖ ఫుడ్ రెస్టరెంట్ అయిన ‘పిస్తా హౌస్’ వచ్చే నెల(డిసెంబర్‌) శామీర్‌పేటలో ఫస్ట్ ఫ్లైట్ రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. నగరంలో ఈ విమాన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడానికి ఎయిర్ ఇండియా మొట్టమొదటి ఎయిర్‌బస్-320ని కొనుగోలు చేసింది పిస్తా హౌస్. ఈ విమానంలో 150 సీట్లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం రెస్టారెంట్ ఏర్పాలు చేసే స్పాట్‌ను విమానాశ్రయాన్ని పోలి ఉండే (రన్‌వే, భద్రతా తనిఖీ, బోర్డింగ్ పాస్ తరహా టిక్కెట్లు మొదలైనవి) విధంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ ప్లైట్ రెస్టరెంట్ హైదరాబాద్‌లో మొట్టమొదటి అయినప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి రెస్టారెంట్లు చాలనే ఉన్నాయి. పాట్నాలోని హాజీపూర్, హర్యానాలోని గుర్గావ్, గుజరాత్‌లోని వడోదర మొదలైన వాటిలో ఇలాంటి రెస్టరెంట్ లు చూడవచ్చు. వడోదరలోని తర్సాలి బైపాస్‌లో గత సంవత్సరం (2021)లో ప్రారంభమైంది.

- Advertisement -

ఆ విమానంలో 102 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. వడోదరలోని ఫ్లైట్ రెస్టారెంట్‌లో వెయిటర్లు మరియు సర్వర్లు ఎయిర్ హోస్టెస్, స్టీవార్డ్‌ల లాగ కనిపిస్తారు. హైదరాబాద్‌లోని పిస్తా హౌస్ ఫ్లైట్ రెస్టారెంట్‌లో కూడా ఇదే మోడల్‌ను అనుసరించే అవకశాలు ఉండవచ్చు అని భవిస్తున్నారు ఫుడ్డీస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement