Thursday, November 21, 2024

రంజాన్ స్పెషల్.. 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల ప్లేట్ల హలీమ్ ఆర్డర్ చేసిన హైదరాబాదీలు..

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇవ్వాల (శుక్రవారం).. ఈ నెల రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజలు ఆర్డర్ చేసిన డిష్ ల గురించి ఒక ఆర్డర్ అనలైటిక్ నివేదికను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఈ నివేదిక రంజాన్ మాసంలో ట్రెండింగ్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ గురించి వివరించింది. ఇక, రంజాన్ సందర్భంగా మన హైదరాబాదీలు స్విగ్గీ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల ప్లేట్ల హలీమ్‌లను ఆర్డర్ చేసినట్టు వెల్లడించింది స్విగ్గీ.

- Advertisement -

హైదరాబాదీలు ఈ రంజాన్‌ నెలలో స్విగ్గీలో 10 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేశారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ. హలీమ్, చికెన్ బిర్యానీ, సమోసాలు వంటి రంజాన్ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలుగా ఉన్నాయని స్వీగ్గీ తెలిపింది. కాగా, రంజాన్ ప్రత్యేక వంటకం హలీమ్… చికెన్ హలీమ్, పాలమూరు పొట్టేల్, పర్షియన్ స్పెషల్ హలీమ్, డ్రై ఫ్రూట్ హలీమ్‌తో సహా తొమ్మిది రకాలకు పైగా 4,00,000 ఆడర్లు వచ్చినట్టు స్విగ్గీ తెలిపింది. పిస్తా హౌస్ హలీమ్ ప్యారడైజ్ బిర్యానీ, మెహ్ఫిల్ వంటి రెస్టారెంట్లు ఇఫ్తార్ సందర్భంగా హైదరాబాదీలకు ఇష్టమైన రెస్టారెంట్లు గా ఉన్నట్టు స్విగ్గీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement