ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కాతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధిందచింది. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 209 పరుగుల భారీ స్కోరుతో చేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా తమ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఎస్ఆర్హెచ్ హెన్రిచ్ క్లాసెన్ (63) ఒంటరి పోరాటం చేయగా చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ (16) కూడా చివరి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) రాహుల్ త్రిపాఠి (20) పరువాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు, హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చరో వికెట్ పడకొట్టారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో ఫిలిప్ సాల్ట్ (54), ఆడ్రీ రస్సెల్ 64 (నాటౌట్) చరో హాఫ్ సెంచరీతో సాధించారు. ఇక, రమణదీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఒక వికెట్ తీయగా.. మయాంక్ మార్కండే రెండు, టి నటరాజన్ మూడు వికెట్లు దక్కించుకున్నారు.