ఎన్ని చెప్పినా మందుబాబులు తమ తీరు మార్చుకోవడం లేదు. హైదరాబాద్ నగరంలో మందుబాబులు తప్పతాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మార్చిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1917 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులు శనివారం నాడు పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 58 మందికి 2 రోజుల నుంచి 9 రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మిగతా 1,859 మంది నుంచి రూ. 1,99,56,300 జరిమానా వసూలు చేశారు. అతిగా తాగి, ఎక్కువసార్లు పట్టుబడ్డ వారిలో ముగ్గురికి 9 రోజులు, 10 మందికి 7 రోజులు, 25 మందికి 5 రోజులు, 20 మందికి 2 రోజుల జైలు శిక్షను కోర్టు విధించింది. మరో 14 మందిని కోర్టు సమయం ముగిసేవరకు నిలబడే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement