Wednesday, November 20, 2024

Hyd | అలా బండ్లు నడిపితే అంతే.. ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

న‌గ‌రంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై వ్యతిరేకంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రేప‌టి (మంగళవారం) నుంచి భారీ స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. న‌గ‌రంలో పెరుగుతున్న‌ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టిన‌ట్టు అదనపు సీపీ (ట్రాఫిక్) పి.విశ్వ ప్రసాద్ తెలిపారు.

కాగా, గత మూడు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒక‌ మహిళ సహా ముగ్గురు మృతి చెందారని ఆయ‌న తెలిపారు. అయితే, ఈ మూడు కేసుల్లోనూ బాధితులు హెల్మెట్ ధ‌రించ‌లేద‌ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన‌ట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 215 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 100 మంది ద్విచక్ర వాహనదారులేనని విశ్వ ప్రసాద్ తెలిపారు.

ముఖ్యంగా రాంగ్ రూట్‌, హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం కార‌ణంగానే రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలిందని వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలోనే రేప‌టి నుంచి హెల్మెట్‌ లేని ప్రయాణం, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు విశ్వప్రసాద్‌ తెలిపారు. హెల్మెట్‌ లేని వారికి రూ.200, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ.2 వేల జరిమాన విధిస్తామని అదనపు సీపీ తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని అదనపు సీపీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement