Thursday, September 19, 2024

Hyderabad – రేపు అర్ధ‌రాత్రి త‌ర్వాత కూడా మెట్రో స‌ర్వీస్ లు

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం రోజును మెట్రో ఆఫ‌ర్
రద్దీ పెరిగితే అద‌నపు మెట్రో స‌ర్వీస్ లు

హైద‌రాబాద్ – గణేషుడి భక్తులకు మెట్రో శుభవార్త చెప్పింది. నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం నిమజ్జనం రోజున మెట్రో సర్వీసులను పొడిగించనున్నట్లు తెలిపింది. నిమజ్జనం అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మెట్రో మార్గాల్లో సెప్టెంబర్ 17న రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.

చివరి మెట్రో ట్రైన్ సెప్టెంబర్ 18న అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఒంటి గంట వ‌ర‌కు ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణికులు వారి ఇళ్లకు వెల్లొచ్చని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్య ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు రద్దీ సమయాల్లో నడపనున్నట్ల మెట్రో పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement