హైదరాబాద్: నగరంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్‌లో అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరిశీలించారు. సీఎం అక్కడ మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటారు. 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్ ఫౌండేషన్ చేపట్టింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
జైపాల్‌రెడ్డికి సీఎం రేవంత్ నివాళి
తెలంగాణ సాధన కోసం నిరంతరం తపించి, రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన రాజకీయ దురంధరుడు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పించారు.హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి గారి స్మారక చిహ్నమైన ‘స్ఫూర్తి స్థలం’ వద్ద పుష్పాంజలి ఘటించారు. పాలమూరు పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్తగా, విలువల వైతాళికుడిగా జైపాల్ రెడ్డి గారు కలకాలం గుర్తుండిపోతారని సీఎం కొనియాడారు
ఈ .కార్యక్రమంలో ముఖ్యమంత్రి తోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,, పలువురు ప్రజాప్రతినిధులు, జైపాల్ రెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు.