హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈనెల 20 వరకు నగరంలో 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
జులై 20వ తేదీ వరకు 359.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఈ తేదీ వరకు సాధారణ వర్షపాతం 210.9 మి.మీ. మాత్రమే. ఐఎండీ డాటా ప్రకారం.. జులైలో నెలలో 285.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, గత పదేళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇక రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
కాగా హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, రాజేంద్రనగర్, కార్వాన్ ఏరియాల్లో 0.5 మి.మీ. నుంచి 2 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. బాచుపల్లిలో ఉదయం 10 గంటలకు భారీ వర్షం కురిసింది.
ఈ వార్త కూడా చదవండి: మరియమ్మ లాకప్‌డెత్ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు