Saturday, January 18, 2025

TG | నిండు ప్రాణం కాపాడిన హైద‌రాబాద్ మెట్రో….

  • ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రినుంచి టూ లక్డికాపూల్‌ గ్లోబల్‌కు గుండె తరలింపు
  • 13 స్టేషన్లు… 13 కిలోమీటర్లు… 13 నిమిషాల్లో గమ్యస్థానానికి

సకాలంలో గమ్యస్థానానికి గుండె చేర్చడం ద్వారా ఒక రోగి ప్రాణాలను కాపాడటంలో తనవంతు పాత్రను హైదరాబాద్‌ మెట్రోరైల్‌ విజయవంతంగా పూర్తిచేసింది. కేవలం 13 నిమిషాల్లో 13 కి.మీ. దూరం, 13 స్టేషన్లను దాటి గమ్య స్థానానికి గుండెను చేర్చింది. గ్రీన్‌ కారిడార్‌గా ప్రకటించి ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌నుంచి లక్డికాపూల్‌కు సాఫీగా గుండెను తరలించారు.

ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రినుంచి వైద్యులు గుండెను తీసుకుని శుక్రవారం రాత్రి 9.30 గంటలకు మెట్రోలో బయల్దేరి లక్డికాపూల్‌లోని గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. దాత ఇచ్చిన గుండెను సకాలంలో చేర్చేందుకు మెట్రోరైల్‌ సంస్థ సహకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement