హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్, మెడికల్ డ్రగ్స్ హబ్‌గా మారడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఏటా 9 బిలియన్ డోసుల వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 65శాతం ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయని చెప్పారు.
మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో పెట్ స్కాన్ యంత్రాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… గాంధీ ఆసుపత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా మరిన్ని సేవలను అందించనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడడంతో హైదరాబాద్‌కు పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులు ఏర్పాటు కావడంతో గల్ఫ్, ఆఫ్ర్‌ికా దేశాల నుంచి ఎంతో మంది వైద్యం కోసం వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో మెడికల్ టూరిజం పెరిగిపోతోందన్నారు. కార్పోరేటు ఆసుపత్రులతో పోటీ పడి ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యశోదా ఆసుపత్రి వ్యవస్థాపకులు జీఎస్.రావు, డైరెక్టర్ పవన్, డా. వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.