హైదరాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్): భారతదేశంలో సగం జనాభా అంటే దాదాపు 70 కోట్ల మంది మొబైల్ గేమర్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్దుల వరకు ఈ ఆటలకు అలవాటు పడ్డారు. ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్ గేమ్‌లలో లీనమయ్యే పరిస్థితి నెలకొంది. దేశంలో మొబైల్ గేమలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని అనేక కంపెనీలు తమ టెస్టింగ్ స్టూడియోలను ప్రారంభించడంతో పాటు నాణ్యమైణ సేవలను అందించడంతో హైదరాబాద్ సక్సెస్ అయింది.
పలితంగా యూరప్, అమెరికన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు తమ ఆటలను ప్రారంభించే ముందు నాణ్యతలను పరీక్షించడానికి భాగ్యనగరం తలుపు తట్టుతున్నాయి. ఫలితంగా ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. మొమైల్ గేమింగ్‌లకు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఈ రంగం భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
వందకు పైగా స్టూడియోలు..
హైదరాబాద్ నగరంలో 100కు పైగా గేమింగ్ స్టూడియోలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 స్టూడియోల వరకు తాము సొంతగా రూపొందించిన గేమ్‌లను అభివఅద్ది చేయడంతో పాటు టెస్టింగ్ సేవలను అందిస్తు న్నాయి. ప్రపంచంలోని పలు అంతర్జాతీయ గ్లోబల్ అనాలసీస్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసి టెక్కీలను నియమించి ఇక్కడి నుంచి వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. వి యత్నాం, థాయిలాండ్ తదితర దేశాలతో పోల్చుకుంటే తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించడంతో అటు హైదరాబాద్ నగరం మొబైల్ గేమింగ్‌లకు కేంద్రంగా మారింది. మడగాస్కర్, స్టారెక్స్ తదితర హలీవుడ్ చిత్రాల రూపకల్పనలో నగరంలోని గేమింగ్ స్టూడియోలనే ఎంచుకున్నారు. టాలివుడ్, బాలివుడ్‌కు చెందిన సినిమాలు ఎన్ని సినిమాలు హైదరాబాద్ గేమింగ్ స్టూడియోల్లోనే పురుడు పోసుకున్నాయి.