హైదరాబాద్ సిటీలో సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 26, 27 తేదీల్లో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాల్లో దున్నల ప్రదర్శన ఉంటుంది. గత సంవత్సరం స్పెషల్ ఎంట్రాక్షన్‌గా కింగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి శ్రీకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.
ప్రభన్యూస్, హైదరాబాద్: సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ప్రధానమైంది అని అర్థం. యాదవ కులస్తులు ఒక ప్య్రతేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్ నిర్వహించుకుంటారు. అలంకరించిన దున్నరాజులతో యువకులు కుస్తీపట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే, ప్రారంభంలో ఈ సదర్ పండుగ హైదరాబాద్‌లో తప్ప దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగేది కాదు. రానురాను ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. భాగ్యనగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్ మారెడ్‌పల్లి, చప్పల్‌బజరా, మధురాపూర్, కార్వాన్, పాతబస్తీల్లోని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నారాయణగూడలోని జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్షించే స్థాయిలో సాగుతుండటం గమనార్హం.
1946లో నారాయణగూడలో ప్రారంభం.!
సదర్ ఉత్సవాలను నారాయణగూడలో సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ ప్రారంభించగా నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగు తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జంట నగరాల్లో 26, 27న రెండు రోజుల్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సదర్ ఉత్సవాలకు హర్యానా, కేరళ, పంజా బ్‌తోపాటు జంట నగరాలు శివార్ల నుంచి దున్నరాజులను ముస్తాబు చేసి తీసుకవస్తారు. ఈనెల 27న ముషీరా బాద్‌లో ప్రారంభమై నారాయణగూడ వరకు ప్రదర్శనసైతం ఉండనుంది. ఉత్సవాలకోసం ఇతర రాష్ట్రాల దున్నరాజులు కూడా వస్తుంటాయి.
స్పెషల్ ఎట్రాక్షన్‌గా శ్రీకృష్ణ.!
గత సంవత్సరం స్పెషల్ ఎట్రాక్షన్‌గా కింగ్ నిలువగా.. ఈసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా శ్రీకృష్ణ నిలవనుంది. ఇప్పటి వరకు శ్రీకృష్ణ 25సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. శ్రీకృష్ణతో పాటు కింగ్, తలసాని అర్జున్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ సారి సదర్‌లో దాదాపు తొమ్మిది దున్నరాజులు సందడి చేయనున్నాయి. అయితే శ్రీకృష్ణ గంభీర ఆకారంలో ఉండనుంది. దీని బరువు 1800 కేజీలు ఉంటుందని సమాచారం. ఎత్తు ఏడు అడుగుల వరకు ఉంటుంది. ప్రతిరోజు దాదాపు రూ.5వేల విలువ చేసే ఆహారం శ్రీకృష్ణ దున్నరాజు కోసం ఖర్చుచేస్తారు.
ఉదయం, సాయంత్రం 10 లీటర్ల పాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డ్రైఫ్రూట్స్, ఖాజు, పిస్తా, ఆపిల్ పళ్లు కూడా తినిపిస్తారు. అంతేకాకుండా ప్రతి రోజు 2 లీటర్ల ఆవనూనెతో మసా జు కూడా చేస్తారు. శ్రీకృష్ణ ఆలనపాలన చూసేందుకు ఇద్దరు కార్మికులుకూడా పనిచేయడం గమనార్హం. ముషీరాబా ద్‌కు చెందిన ఎడ్ల హరిబాబు యాదవ్, చప్పల్‌బజార్‌కు చెందిన లడ్డు యాదవ్, ఖైరతాబాద్‌కు చెందిన మధు యాదవ్ తో పాటు మరికొందరు సదర్ పోటీ పడేందుకు దున్నలను సిద్ధం చేశారు.