ప్రభ న్యూస్, హైదరాబాద్: ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న సిటీల్లో మన భాగ్యనగరం ఒకటిగా ఇన్నాళ్లు చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని రంగాల్లో భాగ్యనగరం విశ్వనగరంగా మారిపోతుంది. హైదరాబాద్ ఇప్పుడు అందరికి ఇష్టమైన ప్రాంతంగా నిలుస్తోంది. కొత్త ఐటీ కంపెనీలకు కేరాఫ్ అ డ్రస్ గా మారుతోంది. ఇతర రంగాల్లోనూ తనదైన ము ద్రను వేస్తోంది. ప్రధానంగా ఐటీ రంగంతో పాటు ఫార్మా, హాస్పిటాలిటీ, విద్య, వైద్య రంగాల్లో దూసుకు పోతూ ప్రపంచ పటంలో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఐటీ అడ్డాగా నగరం
ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం ప్రపంచతో నేడు పోటీ పడుతోంది. ప్రపంచ ఐటీ దిగ్గజాలైన మైక్రో సాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, ఐబీఎం, ఒరాకిల్, ఇన్ఫొసిస్, టీసీఎస్ తదితర కంపెనీలు హైదరాబాద్‌ను అతి ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా భావిస్తున్నాయి. వీటికి తోడు అనేక కొత్త కంపెనీలు భారతదేశంలో ఐటీ కార్య కలాపాల కోసం హైదరాబాద్‌ను తమ కేంద్ర స్థానంగా ఎంచుకుంటున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరా లను తల దన్నుతూ ఐటీ ఎగుమతుల్లో రికార్డులు నెలకొల్పుతోంది.
2020-21లో ఐటీ ఎగుమతులు 1.45 లక్షల కోట్లు కాగా, 2021-22లో దాదాపు 1.65 కోట్లకు చేరింది. దేశ ఐటీ రాజధాని అని చెప్పుకుంటున్న బెం గుళూరు 2021 ఏడాదిలో 1.40 లక్షల ఉద్యోగాలను కల్పిస్తే హైదరాబాద్ మాత్రం 1.50 లక్షల ఉద్యోగాలను కల్పించింది. ఇదే దూకుడును కొనసాగిస్తూ 2026 నాటి కల్లా 3 లక్షల కోట్ల ఎగుమ తులు, 10 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించే లక్ష్యంగా ముందుకు వెలుతోంది.
ఫార్మా ఉత్పత్తుల్లో 50 శాతం ఇక్కడే..
భారత దేశంలో ఉత్పత్తి అయ్యే ఔషదాల్లో 50 శాతం హైదరాబాద్ నుంచే తయారవుతున్నాయి. అర బిందో, క్యాడిల్లా, దివి, సిప్లా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ మొ దలగు 800కు పైగా కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉత్పత్తి యూనిట్లు ఉన్న మెజార్టీ కంపెనీలకు అమెరికా ఎఫ్‌డీఏ గుర్తింపు ఉంది. ఇక్కడ తయారయ్యే ఔషదాలు అమెరికా, యూరప్, ఆఫ్రికా తదితర దేశాలకు ఎగుమ తి అవుతున్నాయి. ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 18 వేల ఎకరాల్లో రూ.64 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ పూర్తయితే ప్రపంచ ఔషద రంగంలో ఐకాన్‌గా వెలుగొందనుంది. ఏటా దాదాపు 60 వేల కోట్ల ఎగుమతులు, 5లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారు.
హస్పిటాలిటికి కేరాఫ్ అడ్రస్
హైదరాబాద్ నగరం ఆతిథ్యానికి మారు పేరు. ఇంగ్లండును సుదీర్ఘ కాల పాలించిన రెండవ ఎలిజబెత్ రాణి హైదరాబాద్ ఆతిథ్యానికి ముగ్దులైంది. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాలకు ఫిదా అయిన ఆమె తన జీవితంలో హైదరాబాద్ నగరం ఎప్పటికి గుర్తుటుందని తెలిపింది. అతిథ్య రంగంలో అంతటి గుర్తింపును దక్కించుకున్న హైదరాబాద్‌కు వివిధ వ్యాపారాలు, వైద్య అససరాలు, టూరిస్టులుగా నిత్యం లక్ష మందికి పైగావస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఎలాంటి లోటు రాకుండా అతిథ్యం అందిస్తూ తన బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకుంటోంది.
ప్రపంచం మెచ్చిన గ్రీన్ సిటీ
ప్రపంచంలోని అనేక నగరాలతో పోటీ పడి హైదరాబాద్ నగరం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022 కైవసం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరి కేటగిరీలోను అత్యుత్తమ సిటీగా ఎంపికైంది. ఇంట ర్నేష్నల్ అసోసియేషన్ ఆఫ్ హర్టికల్చర్ ప్రొడ్యూ సర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందుకున్న ఏకైక ఇం డియా నగరంగా చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ అంటే ఒకప్పుడు వివిధ రకాల పళ్ల తోటలకు నెలవు.
బాగ్ అంటే ఉర్దూలో తోట అని అర్ధం. అంతటి అహ్లాదా న్ని, పచ్చదనానికి భాగ్యనగరం వందల ఏళ్లుగా ప్రతీథి. అయితే కాలక్రమంలో నగరం భారీగా విస్తరించడం, పాత కాలపు నాటి తోటలు, పచ్చదనం కొంత వరకు కనుమరుగు కావడంతో తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అర్బన్ ఫారెస్ట్రీ పై ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్ల మద్యలో మొక్కలు నాటడం, ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ఇప్పుడున్న పార్కులకు తోడు అనేక కొత్త పార్కులను ఏర్పాటు చేస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న అర్బన్ ఫారెస్ట్రింగ్‌తో నగరం పచ్చదనానికి మారు పేరుగా వృద్ది చెందుతోంది.