Tuesday, November 26, 2024

హైదరాబాద్‌కు మరో గుర్తింపు

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గా పేరుగాంచిన హైదరాబాద్ కి ఇప్పుడు మరో గుర్తింపు రానుంది. బయోలాజికల్ -ఈ కి వంద కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల తయారీ బాధ్యతనిచ్చాయి పలు దేశాలు. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్‌ గ్రూపు కోసం 2022 చివరికల్లా 100 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేసే సువర్ణావకాశాన్ని బయోలాజికల్‌-ఈ కంపెనీ దక్కించుకుంది. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు టీకా సహా పలు కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎ్‌ఫసీ) టీకాల ఉత్పత్తి కోసం బయోలాజికల్‌-ఈ కంపెనీకి ఆర్థిక వనరులను సమకూర్చుతుందని వెల్లడించింది వైట్ హౌస్. పేద దేశాలకు టీకాలను ఎగుమతి చేసే స్థాయిలో ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన తోడ్పాటును డీఎ్‌ఫసీ, జైకాలు అందిస్తాయని వైట్‌హౌస్‌ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement