హైదరాబాద్‌కు చెందిన బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్ డైరెక్టర్ డాక్టర్ పి. రఘు రామ్‌కు ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RCS) నుండి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (FRCS) గౌరవ ఫెలోషిప్ లభించింది. రాయల్ కాలేజీ 482 ఏళ్ల చరిత్రలో గౌరవ ఎఫ్‌ఆర్‌సిఎస్‌తో గౌరవించిన భారతీయ సంతతికి చెందిన అతి పిన్న వయస్కుడైన సర్జన్‌గా డాక్టర్ రఘు రామ్ నిలిచారు అని సంస్థ తెలిపింది. శస్త్రచికిత్స కళ, విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాయల్ కాలేజ్ అందించిన అత్యున్నత గుర్తింపు ఇదేనని పేర్కొంది. కాగా, డాక్టర్ రఘు రామ్, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్‌గా ఉన్నారు.
తనకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందించినందుకు కాలేజ్ కౌన్సిల్‌కి కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ రఘురామ్. గత 15 సంవత్సరాలుగా తాను మాతృభూమిలో అత్యుత్తమ బ్రిటీష్ పద్ధతులను అవలంభించడానికి కృషి చేసినట్టు తెలిపారు. UK మధ్య ‘జీవన వారధి’గా ఉన్నందుకు గర్వపడుతున్నా అన్నారు ఈ అత్యున్నత గౌరవాన్ని భారతదేశంతోపాటు, తన కుటుంబానికి, రోగులకు, KIMS హాస్పిటల్స్ లోని తన సహోద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ శస్త్రచికిత్స సోదరులకు అంకితం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.