బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్‌ఎస్‌ఐ) సేవలకు, కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్నో సంస్కృతులకు, సాంకేతికతలకు, ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందన్నారు. ఈ రోజు (మంగళవారం) హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ఎక్స్‌పీరీయన్ గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
ఎక్స్‌పీరియన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దేశంలో ఇన్సూరెన్స్ వృద్ధి సాధించేందుకు ఎంతో అవకాశముందన్నారు. కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నిర్ణీత లక్ష్యం కంటే ముందుగానే ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.