Thursday, November 21, 2024

షూటింగ్‌ హబ్‌ గా హైదరాబాద్‌.. అంతర్జాతీయ కోచ్‌లతో శిక్షణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అంతతరర్జాతీయ షూటింగ్‌ హబ్‌ గా హైదరాబాద్‌ ను తీర్చి దిద్దనున్నట్లు రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌, క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. ఈమేరకు షూటింగ్‌ లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు విదేశీ కోచ్‌ లను నియమించనున్నట్లు తెలిపారు. శనివారం గచ్చిబౌలి లోని హెచ్‌ సి యు లోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) , గగన్‌ నారంగ్‌ స్పోర్ట్స్‌ ప్రమెషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హై పర్ఫామన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (హెచ్‌ పి టిసి ) ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ ట్రైనింగ్‌ సంటర్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ సహకారంతో క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

దేశంలో అత్యున్నత క్రీడా పాలసీని తెలంగాణ రూపొందించిందని చెప్పారు. ఈ పాలసీని త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన తెలంగాణ క్రీడాకారులకు నగదు పురష్కారాలను గణనీయంగా పెంచినట్లుమంత్రి తెలిపారు. క్రీడాకారులకు జూబ్లిహిల్స్‌ లోని విలువైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కేవలం తెలంగాణకే దక్కుతుందన్నారు.

రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మౌలిక సదుపాయాలను కల్పించి గ్రామీణ క్రీడా కారులను ప్రోత్సహిస్తున్నట్లు శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు అనేక ప్రోత్సహాలు కల్పించినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన నేషనల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పతకాలను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రదానం చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్వయంగా 25మీటర్ల రేంజ్‌ షూటింగ్‌ లో పాల్గొని టార్గెట్‌ ను పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement