Friday, November 22, 2024

విశ్వనగరంగా హైదరబాద్‌… అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విశ్వనగరంగా హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అనేక రంగాల ముఖ్యమైన కార్యకలాపాలకు హైదరాబాద్‌ నగరం కేంద్రంగా మారిందన్నారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని చెప్పారు. హైదరాబాద్‌ లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ లో నిర్వహిస్తున్న టైమ్స్ హోమ్ హంట్‌ ఎక్స్‌పోను ఆ రోజు (శనివారం) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోవిడ్‌-19తో అన్ని రంగాలకు దెబ్బ పడిందన్నారు. అదే రీతిలో రియల్‌ ఎస్టేట్‌ రంగంపైన అధిక ప్రభావం పడిందన్నారు. అయినప్పటికీ కొద్ది కాలంలోనే ఈ రంగం వేగంగా కోలుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకుంటూ ప్రతీ రంగం వేగంగా ముందుకు వెళుతోందన్నారు. అదే రీతిలో తెలంగాణలోనూ రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా పుంజుకుంటోందని చెప్పారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా నిర్మాణ పనులకు అనుమతులు వచ్చేలా చట్టాలు చేసిందన్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించాక తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ ఇప్పుడు ఓ బ్రాండ్‌ అని చెప్పారు. ఏమి చేసినా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా చేయాలన్న రీతిలో సీఎం రాష్ట్రానికి ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ను సృష్టించారని చెప్పారు. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా నిలిచిందని, చక్కటి వాతావరణం, 24 గంటల కరెంటు,తాగు నీటి కొరత లేని ప్రాంతం. మెట్రో , ఆర్టీసీ వంటి రవాణా సదుపాయాలు మంచి విద్యాలయాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఇన్ని విశిష్టతలు ఉన్నందునే హైదరాబాద్‌ భాగ్యనగరం అయిందని వ్యాఖ్యానించారు. ”#హదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఈ నగరంతో ప్రేమలో పడతారు. మర్చిపోలేరు. మళ్లి మళ్లి ఇక్కడకు రావాలన్నంత ప్రేమను ఈ నగరం అందిస్తోంది. అనేక మంది ప్రముఖులు ఇక్కడ స్థిరపడాలని ఇళ్లు కొనుక్కొంటున్నారు.” అని చెప్పారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ స్టాళ్లను మంత్రి సందర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement