అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ టాపార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్.. 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఈ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ మినిహా మిగితా బ్యాటర్లంగా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రాహుల్ త్రిపాఠి (55) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (32) పరుగులతో పరువాలేదనిపించాడు. ఇక ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (30) స్కోర్ బోర్డ్‌పై పరుగులు పెంచాడు. దీంతో కోల్‌కతా ముందు 160 పరుగుల టార్గెట్ సెట్ చేయగలిగింది హైదరాబాద్ జట్టు.
ఇక కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు