Wednesday, November 20, 2024

కాలు క‌ద‌ప‌కుండానే-టీజే టిల్లు సాంగ్ కి డ్యాన్స్ చేసిన మంత్రి త‌ల‌సాని

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న నేప‌థ్యంలో హైదారాబాద్‌లో ర‌న్‌లో భాగంగా రికార్డైన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ ర‌న్‌ను తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ర‌న్ ప్రారంభానికి ముందుకు వామ‌ప్ కోసం నిర్వాహ‌కులు డీజే టిల్లు సినిమా సాంగ్‌ను ప్లే చేశారు. ఈ పాట మొద‌లు కాగానే… సాధార‌ణ పౌరుల‌తో పాటు ర‌న్‌కు హాజ‌రైన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఉత్సాహంగా పాట‌కు అనుగుణంగా స్టెప్పులేయ‌డం మొద‌లెట్టారు. వారిని చూసిన మంత్రి త‌ల‌సాని కూడా చేతులు ఊపుతూ ఉల్లాసంగా క‌నిపించారు. అయితే కాలు ఏమాత్రం క‌ద‌ప‌కుండానే… ఉన్న చోటునే నిల‌బ‌డి త‌ల‌సాని ఈ పాట‌కు స్టెప్పులేయ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement