వాతావరణ శాఖ సూచించినట్లుగానే నగరంలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరనం చల్లబడి కుండపోతగా వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్ శేరిలింగంపల్లి, మియాపూర్, హెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు విరిగిపోగా… నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ రోడ్లపై మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.