Tuesday, December 24, 2024

HYD | ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్..

ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు సాయంత్రం ప్రారంభించారు.

కాగా, నగరంలోని పలు ప్రముఖ బ్రాండెడ్ హోటళ్లు ఈ ఫుడ్ స్టాల్స్ కౌంటర్లను ఏర్పాటు చేశాయి. వివిధ రకాల రుచికరమైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి.

హైదరాబాదీ బిర్యానీ, ముఘలాయి వంటకాలు, చాట్‌, నర్తన్‌ తదితర వెరైటీ ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వీటితోపాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమూరు గ్రీల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటు కోడి చికెను, పుడ్ జాయింట్స్… బేకరీ ఐటమ్స్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు అందుబాటులో ఉంచారు.

నిలోఫర్ కెఫ్, బ్రౌన్ బేర్ బేకరిలు ప్రాంకిల్ మ్యాగి హాట్స్పాట్ కాంటినెంటల్ కాఫీ, ప్రాంకి అండ్ రోల్స్, మొమోస్ అండ్ ప్రైస్ తో పాటు గోకుల్ చాట్ కూడ తమ సంస్థ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేసారు. విజయోత్సవంలో పాల్గొనే సందర్శకుల సౌకర్యార్థం 100కు పైగా ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్, జీఏడీ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement