Friday, November 22, 2024

20న హైబ్రిడ్ ఎక్లిప్స్.. మళ్లీ పదేళ్లదాక రాదు, అస్సలు మిస్ కావద్దు

ఈ నెల 20వ తేదీ.. గురువారం ఒక అద్బుతమైన “హైబ్రిడ్ ఎక్లిప్స్” చోటుచేసుకోనుంది. భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. బుధవారం, గురువారాల్లో.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని కొన్ని ఇతర ప్రాంతాలకు ఈ “హైబ్రిడ్” గ్రహణం రాబోతోంది. దీన్ని చూడటం అస్సలు మిస్ చేయవద్దు అంటున్నారు ఖ‌గోళ శాస్త్రవేత్త‌లు. ఎందుకంటే ఇలాంటి హైబ్రిడ్ ఎక్లిప్స్‌ దాదాపు మరో దశాబ్దం (నవంబర్ 31, 2031) వరకు ఏర్ప‌డదట.

- Advertisement -

హైబ్రిడ్ సూర్యగ్రహణాలు చాలా అరుదుగా వ‌స్తాయ‌ని, 21వ శతాబ్దంలో కేవలం 3.1% సూర్యగ్రహణాలలో మాత్రమే సంభవిస్తాయ‌ని ఖ‌గోళ శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఈ గ్రహణం నార్త్ వెస్ట్ కేప్ ద్వీపకల్పం, పశ్చిమ ఆస్ట్రేలియాలోని బారో ద్వీపం, తూర్పు తైమూర్, అలాగే డమర్ ద్వీపం, ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 20న 1:30 – 7 గంటల (యూనివర్సల్ టైమ్) మధ్య సూర్యునికి ఎదురుగా చంద్రుడు వెళ్లడాన్ని చూడవచ్చు. ఈ గ్రహనాన్ని బుధవారం, గురువారం, శుక్రవారాల్లో చూడవచ్చు. హైబ్రిడ్ గ్రహణం వలె, చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పివేస్తాడు.. అయితే చూసే వారి ప్లేస్ ని బట్టి “అగ్ని వలయంష మాదిరిగా ప్రకాశిస్తుంది. గ్రహణం ఏర్పడే క‌చ్చితమైన సమయం భూమిపై మన స్థానాన్ని బట్టి మారుతుందని శాస్త్రవేత్త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement