Friday, November 22, 2024

ఉప ఎన్నిక కోసం కేసీఆర్ పెట్టిన ఖ‌ర్చుపై..ఈటెల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లను సీఎం కేసీఆర్ సీరియ‌స్ గా తీసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకే ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌త్యేకంగా ప్ర‌వేశ‌పెట్టారు. భారీగా న‌గ‌దుని పంచిపెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా ఈ ఎన్నిక‌ల కోసం మంత్రి హ‌రీశ్ రావుతో పాటు ప‌లువురు మంత్రులు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌కాం వేసి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. బిజెపి అభ్య‌ర్థిగా ఈటెల రాజేంద‌ర్ ఈ ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. అయితే ఆయ‌న‌ని ఎలాగైనా ఓడించాల‌నే పంతాన్ని ప‌ట్టుకు కూర్చున్నారు కేసీఆర్. అయితే ఈ ఉప ఎన్నిక‌ల కోసం కేసీఆర్ ఎంత ఖ‌ర్చు పెట్టార‌నేదానిపై క్లారిటీ ఇచ్చారు ఈటెల‌.

ఉప ఎన్నిక కోసం కేసీఆర్ భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని.. సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఈటెల రాజేంద‌ర్ ఆరోపించారు. ఇంత భారీగా ఖర్చు చేసినా హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని కాపాడుకోవాలని భావించారని తెలిపారు. వందలాది పోలీసుల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని.. చివరకు డ్రైవర్లు.. పీఏలను కూడా కోవర్టులుగా వాడుకొని నీచ రాజకీయాలు చేశారని మండిప‌డ్డారు. హుజూరాబాద్ పరిస్థితిని అప్రకటిత ఎమర్జెన్సీగా మార్చిన వేళ.. దీనిపై ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఓటుతో చెప్పారన్నారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు ఈటెల‌.. హుజూరాబాద్ ప్రజలు చరిత్రను తిరగరాశారు. కేసీఆర్ కుట్రల్ని అర్థం చేసుకున్నారు. డబ్బులు పంచి.. అసత్య వాగ్దానాలు చేశారు అంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement