Sunday, June 30, 2024

Huzurabad – బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌజ్ అరెస్ట్…

మంత్రి పొన్నంపై వంద కోట్ల అనినీతి ఆరోణ‌లు
హుజూరాబాద్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మ‌ధ్య స‌వాళ్ల ప‌ర్వం
ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కౌశిక్ రెడ్డి అరెస్ట్
ఇంది వ‌ద్దే దేవుడి బొమ్మ‌తో కౌశిక్ ప్ర‌మాణం .

- Advertisement -

ఫ్లైయాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన నేప‌థ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతివిమర్శలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరుపార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

స‌వాళ్లు … ప్ర‌తి స‌వాళ్లు

మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్ తోసిపుచ్చారు. కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ చెల్పూర్ హనుమాన్ టెంపుల్‌లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన పాడి.. మంగళవారం ఉదయం వీణవంకలోని తన నివాసం నుంచి చెల్పూర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రణవ్ కూడా చెల్పూర్ బయలుదేరారు. దీంతో పోలీసులు హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవ్వరినీ అక్కడికి అనుమతించడం లేదు. హనుమాన్ టెంపుల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

దేవుడి చిత్రపటంపై కౌశిక్ రెడ్డి ప్రమాణం

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లనీయకపోవడంతో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు అని కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి, తడిబట్టలతోనే దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు. ఫ్లైయాష్ తరలింపులో రూ.100 కోట్ల అవినీతి, ఓవర్ లోడ్ లారీల విషయంలో అవినీతికి పాల్పడలేదని తన మాదిరిగానే ప్రమాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఛాలెంజ్ చేశారు. టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయడానికీ సిద్ధమని, తానొక్కడినే వస్తానని చెబుతూ.. దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement