Tuesday, November 19, 2024

భారత్‌ వైఖరిపై ఇరాన్‌ సంతృప్తి.. ఇండియాలో పర్యటించిన ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి

మహ్మద్‌ ప్రవక్త వివాదంపై భారత్‌ అనుసరించిన వైఖరిపై ఇరాన్‌ పూర్తి సంతృపిగా ఉందని భారత్‌లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్‌ అమిర్‌ అబ్దుల్లాహిన్‌ అన్నారు. ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా ఏడాది క్రితం బాధ్యతలు తీసుకున్న హుస్సేన్‌ మొదటిసారి ఇండియా పర్యటనకు వచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్య మహ్మద్‌ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. భారత ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులు సైతం మహ్మద్‌ ప్రవక్తను గౌరవిస్తారని అజిత్‌దోవల్‌కు ఆయనకు వివరించారు.ఈ వివాదంపై భారత చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌, భారత్‌ అనుసరించిన తీరు ఇతర దేశాలకు మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ వివాదంపై భారత అధికారులు అనుసరించిన వైఖరి పట్ల ముస్లింలు సంతృప్తికరంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్‌తో భేటీ అనంతరం ఇరాన్‌ విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో రెండు రౌండ్ల చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై మంత్రులు చర్చించారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో సైతం ఇరాన్‌ విదేశాంగ మంత్రి సమావేశమయ్యారు.

మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ వ్యాఖ్యలపై గతవారం కువైట్‌, ఖతార్‌ దేశాలతో పాటు ఇరాన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌లోని భారతదేశ రాయబారిని పిలిచి తమ దేశం తరపున తీవ్ర వ్యతిరేకతను తెలియచేయడంతో పాటు ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement