Tuesday, November 26, 2024

TG | భారీ వర్షాలు.. నిండిన హుస్సేన్ సాగర్..

హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లోకి నీరు చేరుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నగర వ్యాప్తంగా గంటపాటు భారీ వర్షం కురవడంతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు కాగా…. ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీటి మట్టం 513.210 మీటర్లకు చేరుకుంది.

దీంతో అప్రమత్తమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇక పరిస్థితిని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. వరదల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement