భార్యలను ఎవరైనా ఏదైన అంటే భర్తలు గొడవలకు దిగడం సహజం.. కొన్ని గొడవలు కేవలం పంచాయితీతో ఆగుతాయి.. లేదా పోలీసుల చర్చలతో ఆగుతాయి. మనం అలాంటి గొడవలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఇక సోషల్ మీడియాలో రకరకాల గొడవలకు సంబందించిన వీడియోలు వైరల్ అవ్వడం కామన్.. తాజాగా అలాంటి ఓ గొడవ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ బస్సులో నా భార్యకు సీటు కావాలి, నా భార్యకు సీటు కావలి అంటూ భర్తలు యుద్దానికి కాలు రువ్వారు.. ఇక భార్యలు కూడా భర్తలకు సపోర్ట్ చేస్తూ నాలుగు మాటలు ఎక్కువగా మాట్లాడుతూ మాటలతో పోయే గొడవను కొట్టుకొనే వరకు తీసుకొచ్చారు.. భార్యలకు సీటు కావాలని భర్తలు బస్సులో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.. ఆ వీడియోనే ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీసింది..
వివరాల్లోకి వెళితే.. ఈ గొడవ ఎక్కడో కాదు.. తెలంగాణలోనే జరిగింది.. ఆర్టీసీ బస్సులో సీటు కోసం భర్తలు దాడి చేసుకున్న ఘటన తెలంగాణ మహబూబాబాద్ లో వెలుగు చూసింది.. తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు సీటు కోసం కర్చీఫ్ లు వేశారు. ఒకరు వేసిన సీటులో మరొకరు కూర్చుకోవడంతో మహిళలు దారుణంగా తిట్టుకున్నారు.. ఈ వాదనలు భర్తల వరకు వెళ్లడంతో ఇద్దరు భర్తలు మొదట మాటలతో మొదలు పెట్టినా చివరకు చెప్పులతో కొట్టుకొనేవరకు వెళ్లింది.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది..