Tuesday, November 26, 2024

ప్రియుడితో భార్య సరసాలు… మంచం కింద ఉన్న భర్త !!

ఐదు నిమిషాల సుఖం కోసం జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. మరికొంతమంది ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఓ వ్యక్తికి ఉద్యోగం లేదని సహాయం చేయాలని మరో వ్యక్తి భావించాడు. కానీ ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి భార్య పైనే కన్నేశాడు ఆ ప్రబుద్ధుడు. ఆ విషయం తెలుసుకున్న భర్త మంచం కింద 6 గంటలు దాక్కొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గుండెల్లో కత్తితో పొడిచాడు . ఈ ఘటన మొత్తం బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భరత్ కుమార్ కార్పెంటర్ గా పనిచేస్తూ బెంగళూరులోని రోహిత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. భరత్ కు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య వినుత స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఇద్దరు సంపాదిస్తూ కుటుంబాన్ని సాఫీగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

ఆ సమయంలో వినూత స్నేహితుడు శివరాజ్ ఊరు నుంచి ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాడు. వారం రోజులు ఇంట్లోనే ఉన్నాడు. భార్యకు ముందుగానే పరిచయం ఉండడంతో భరత్ పెద్దగా పట్టించుకోలేదు. శివరాజ్ ఉద్యోగం కోసం తన వంతు కూడా హెల్ప్ చేశాడు. ఇక ఒక చోట వినూత ఉద్యోగం ఇప్పించింది.

అయితే వినూత తన పట్ల చూపించిన అభిమానాన్ని శివరాజ్ ప్రేమ అనుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఒక రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పాడు. అతడు ఆ మాట చెప్పగానే మండిపడింది. కానీ, శివరాజ్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. తరచూ వినుత వద్దకు వస్తూ తన ప్రేమను గురించి చెప్పేవాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో శివరాజ్ మాటలకు లొంగిపోయింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్త భరత్ కు తెలిసింది. శివరాజ్ ను భార్యను మందలించాడు. ఇద్దరూ కూడా ప్రవర్తన మాత్రం మార్చుకోలేదు. ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరొక ప్రాంతంలో ఓ గదిని అద్దెకి తీసుకుని ఉంటుంది. అక్కడికి కూడా శివరాజ్ ఎప్పటికప్పుడు వస్తుండేవాడు. దీనితో తన భార్యను తనకు కాకుండా చేసిన శివరాజ్ పై కోపం పెంచుకున్నాడు భరత్.

ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ కత్తిని కొన్నాడు. వినుత ఇంటి పక్కనే రెక్కీ నిర్వహించి శివరాజ్ ఏ సమయంలో వస్తున్నాడో తెలుసుకున్నాడు. మార్చి 25 గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు భరత్ వినుత ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వినుత చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్లింది. వెంటనే భరత్ ఎవరికీ కనిపించకుండా ఇంట్లో మంచం కింద దాక్కున్నాడు. వినుత వచ్చింది… మంచిగా చికెన్ వండింది. శివరాజ్ కూడా వచ్చాడు. కలసి ఇద్దరూ భోజనం చేసారు. ఆ తరువాత పడక పైకి చేరారు. రొమాన్స్ మొదలు పెట్టారు. అవన్నీ కూడా మంచం కింద ఉండి భరత్ గమనిస్తున్నాడు. కాసేపటికి వినుత బాత్రూం కి వెళ్ళింది. వెంటనే బయటకు వచ్చిన భరత్ బాత్రూం గడియ పెట్టేశాడు. తన వద్ద ఉన్న కత్తి తీసి పడుకొని ఉన్న శివరాజ్ ను కసితీరా పొడిచాడు. దీంతో అక్కడికక్కడే శివ రాజ్ మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement