Tuesday, November 26, 2024

అసోంలో తుడిచిపెట్టుకుపోయిన వందలాది ఇళ్లు.. 174 మంది మృతి

అసోం: అసోంలోని బార్‌ పేట జిల్లాలోని చెంగా అసెంబ్లి నియోజకవర్గం పరిధిలోని కచుమారా ప్రాంతంలో 200కి పైగా కుటుంబాలు తమ ఇళ్లను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఎగువ నుంచి బ్రహ్మ పుత్ర ప్రవహించడంతో ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. నది నీళ్లు భారీగా రావడంతో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. కోతకు గురయ్యాయి. బాధిత కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరళి వెళ్లాయి. వీరిలో చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సహాయక చర్యల వల్ల ప్రయోజనం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నది కోతను నియంత్రించడానికి, తమ భూములను రక్షించుకోవడానికి వెదురు బొంగులు తయారు చేస్తున్నారు. నది కోతను నియంత్రించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారి ఆరోపణ. అస్సాం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకారం ఈ ఏడాది వరదల కారణంగా అసోంలోని 34 జిల్లాల్లో దాదాపు 89.11 లక్షల మంది ప్రభావితమయ్యారు. వరదలు, కొండ చరియలు విరిగి పడటంతో ఇప్పటి వరకు 174 మంది చనిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement