Thursday, October 3, 2024

AP | నందిగామలో ధోనీకి వంద అడుగుల కటౌట్..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు (జులై 7న‌) సందర్భంగా కృష్ణా జిల్లా ఫ్యాన్స్ ఘనంగా ఏర్పాట్లు చేశారు. నందిగామ మండలం అంబారుపేట వద్ద జాతీయ రహదారి పక్కనే వంద అడుగుల ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ కటౌట్ ఏర్పాటుచేస్తుంటారు.

గతేడాది 77 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా.. ఈసారి వంద అడుగులతో కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ బర్త్‌ డే సందర్భంగా అన్నదానం కూడా చేస్తున్నట్లు అభిమానులు తెలిపారు. ప్రస్తుతం ఈ కటౌట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement