Friday, November 22, 2024

Wher is Humanity | మానవత్వమా నీవెక్కడా.. భార్య మృత‌దేహంతో కాలిన‌డ‌క‌న విశాఖ నుంచి ఒడిశాకు

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడే సాములు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్య ఈడే గురు (30 )ను విశాఖపట్నం జిల్లా సంగివలసలోని అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. అయితే చికిత్సకు ఆమె స్పందించడం లేదని, తిరిగి సొంత ఊరు తీసుకెళ్లాల‌ని వైద్యులు తెలిపారు. చేసేది ఏమీ లేక భార్యను తీసుకొని, ఆటోలో విజయనగరం వస్తుండగా మార్గ మధ్యంలో భార్య ఈడే గురు మరణించింది. దీనితో ఆటో డ్రైవరు చెల్లూరు రింగు రోడ్డులో వారిని దించేసి వెళ్లిపోయారు. ఎవరిని అడిగినా సహకరించడానికి ముందుకు రాలేదు. పైగా సాములు భాష కూడా ఎవరికి అర్థం కాక రోడ్డుపై వెళ్లేవారు పట్టించుకోలేదు.

దిక్కుతోచని స్థితిలో సాములు తన భార్య శవాన్ని భుజం మీద వేసుకొని, కాలి నడకన బయలుదేరాడు. భార్య చనిపోయిన దుఃఖాన్ని గుండెలో దిగమింగుకుని శవాన్ని భుజంపై మోసుకుంటూ ఒడిశా దిశగా సాగాడు. అయితే ఏమీ జరిగిందో తెలియక, అతను ఒడియాలో చెప్పిన విషయం అర్ధంకాక చాలాసేపటి తరువాత స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ తిరుపతిరావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ తో కలిసి చెళ్లూరు రింగు రోడ్డలో వెళ్లి చూశారు.

రహదారిపై తన భార్య శవాన్ని భుజాన వేసుకొని సాములు నడుచుకుంటూ వెళ్తుండడం గమనించారు. సాములును ఆపి అతని ద్వారా విషయం తెలుసుకొని ఒడిశాలో ని అతని బంధువులతో ఫోనులో మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు రూరల్ సిఐ తిరుపతిరావు ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించారు. ఎట్టకేలకు పోలీసులు అందించిన సహాయానికి శాములు కృతజ్ఞతలు తెలపాడు. అయితే.. చాలా దూరం వరకు తన భార్య శవాన్ని భుజంపైనే మోస్తూ వెళ్లడం.. మాత్రం మానవత్వాన్ని ప్రశ్నింస్తూనే ఉందని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement