బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే రెండు రోజులపాటు తగ్గిన బంగారం ధరలు నిన్న ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా మళ్లీ ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.44,250కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.410 తగ్గి రూ.48,270 కి చేరిది.
మరోవైపు బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.74,000 వద్ద ఉన్నది. మాములుగా ఇండియా లో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మగువల విషయంలో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది.