ఓ సముద్ర తీరంలో పెళ్ళి రిసెప్షన్ వేడుకని ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుక ఏర్పాట్లని భారీ అలలు ముంచెత్తాయి.ఈ సంఘటన USAలోని హవాయిలో జరిగింది. వెడ్డింగ్ పార్టీపై అలలు ఎగసిపడుతున్నట్లు చూపించే వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.ఈ క్లిప్‌లో బీచ్‌సైడ్ పార్టీలోని వ్యక్తులందరినీ భారీ అలలు తడిపి ముద్దచేశాయి.. భారీ అలలకి టేబుల్స్ ..కుర్చీలు దొర్లిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన క్లిప్ ఇప్పటివరకు 3,000 కంటే ఎక్కువ వ్యూస్ ని సాధించింది.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ వీడియోపై పలువురు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement