భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఈ వన్డేలో.. సఫారీలను 116 పరుగులకే ఆలైట్ చేసిన భారత్… కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లలో సాయి సుదర్శన్ 55, శ్రేయాస్ అయ్యర్ 52 అర్ధ సెంచరీలతో మెరిశారు.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు అదరగొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరూ తమ పేస్‌తో నిప్పులు చెరగడంతో తొలి వన్డేలో సఫారీలు 27.3 ఓవర్లలో 116 పరుగులకే తోకముడిచారు. సౌతాఫ్రికా జట్టులో ఆల్ రౌండర్ అండిల్ పెహ్లుక్వాయో 33 పరుగులతో టాప్ స్కోరర్. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు (5/37)తో రాణించగా అవేశ్ ఖాన్ (4/27) కూడా మెరిశాడు. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.