సూయజ్ కాలువలో లో చిక్కుకుపోయిన భారీ నౌక ఇప్పుడు విపరీతమైన కష్టాలు తెచ్చిపెడుతోంది. నౌక కాలువలు అడ్డంగా ఉండిపోవడంతో రవాణా రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొన్ని వందల కొద్ది చిన్న నౌకలు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆగిపోయిన ఆ ప్రాంతాన్ని సాటిలైట్ ఫోటోలు తీసి పంపింది. కెనాల్ లోని ఇసుక మేటల్లో నౌక అడ్డుగా చిక్కుని పోగా, ఎన్నో దేశాలకు చేరుకోవాల్సిన నౌకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు విడుదల అయ్యాయి. దాదాపు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నౌకలు ముందుకు సాగేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.
ఈ చిత్రాలను మాక్సర్ వరల్డ్ వ్యూ శాటిలైట్ చిత్రీకరించింది. ఈ కృత్రిమ వాణిజ్య నౌకా మార్గం ఎన్నో దేశాల అవసరాలను తీరుస్తున్నదన్న సంగతి తెలిసిందే. ఇసుక మేటల్లో చిక్కుకున్న నౌకను తొలగించేందుకు దాదాపు 5 రోజులుగా సాగుతున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతూ ఈ కెనాల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే