Monday, November 18, 2024

తుర్కయంజల్‌ ప్లాట్లకు భారీ స్పందన…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నాగార్జునసాగర్‌ రోడ్డు వెంట తుర్కయంజల్‌ వెంచర్‌లో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో 34 పెద్ద సైజ్‌ ప్లాట్లతో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) వెంచర్‌ రూపొందించింది. దీనికి సంబంధించి తొలి దశ ప్రి బిడ్‌ మీటింగ్‌ను శనివారం వెంచర్‌ స్థలంలో హెచ్‌ఎండీఏ అధికారులు నిర్వహించారు. దాదాపు 200 మంది ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ప్రి బిడ్‌ సమావేశానికి హాజరై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్‌ ఆఫీసర్‌ గంగాధర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ గంగాధర్‌, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌, తుర్కయంజల్‌ సైట్‌ ఇంజనీర్‌ ధన్‌ మోహన్‌సింగ్‌ వెంచర్‌ ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ప్రతినిధి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి లోన్లు ఏ విధంగా ఉంటాయనే అంశాలను బ్యాంకు అధికారులు వివరించారు. ఈనెల 16న జరిగే రెండో దశ ప్రి బిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. తుర్కయంజల్‌ వెంచర్‌లోని 34 ప్లాట్ల విక్రయాలు ఈనెల 30న ఆన్‌లైన్‌ ద్వారా వేలం (ఈ-ఆక్షన్‌) జరుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement