Tuesday, November 26, 2024

HMDA | తొలి ఫ్రీ బిడ్ భేటీకి భారీ రెస్పాన్స్‌.. 100కు పైగా రియాల్టీ కంపెనీల ప్రతినిధులు హాజరు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బుధవారం నిర్వహించిన ఫ్రీ బిడ్‌ సమావేశానికి మంచి ఆధారణ లభించింది. పలు కంపెనీలు ల్యాండ్‌ పార్సిల్స్‌ గురించి తెలుసుకునేందుకు తరలివచ్చారు. వారి అనుమానాలను, ఆయా ప్రాంతాల వారిగా ల్యాండ్‌ ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. రియాల్టిd రంగంలో అగ్రగామీగా ఉన్న సంస్థలతో పాటు పలు కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తొలి సమావేశం సక్సెస్‌
మొదటి సమావేశంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 13 ల్యాండ్‌ పార్సిల్స్‌ విక్రయానికి ఉంచారు. వీటిపై సమావేశానికి హాజరైన కొనుగోలుదారులకు హెచ్‌ఎండిఏ అధికారులు అవగాహన కల్పించారు. మీటింగ్‌లో దాదాపు 100కు పైగా ఆసక్తి కలిగిన పలు రియాల్టిd కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ల్యాండ్‌ పార్సిల్స్‌ గురించి సమావేశంలో పాల్గొన్న హెచ్‌ఎండిఏ అధికారులను అడిగి వి వరాలను తెలుసుకున్నారు. ల్యాండ్‌ పార్సిల్స్‌ కొనుగోలు దారులకు ఈ నెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉందని సూచించారు.

ధరావత్తు చెల్లించిన వారు ఈ నెల 18వ తేదీన జరిగే ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. బేగంపేట్‌ టూరిజం ప్లాజాలో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్‌ ఆఫీసర్‌ (ఈవో) గంగాధర్‌, హెచ్‌ఎండిఏ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ (సి పిఓ) గంగాధర్‌, రంగారె డ్డి జిల్లా ఆర్డీవో చంద్రకళతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement