Friday, November 22, 2024

గ్యాస్ సిలిండ‌ర్‌పై భారీ త‌గ్గింపు..!

గ్యాస్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం భారీగా త‌గ్గించింది. ప్ర‌భుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ఎల్పీజీ క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గించ‌డంతో 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ.135 త‌గ్గింది. ఈ ధ‌ర‌లు నేటి నుంచి (జూన్ 1) అమ‌లులోకి రానున్న‌ది. అయితే ప్ర‌స్తుతం 19 కేజీల సిలిండ‌ర్ మార్కెట్ లో రూ.2219కు ల‌భించ‌నున్న‌ది. నిన్న ఇదే సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ.2354గా ఉండేది. మే 19వ తేదీన డొమెస్టిక్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను చివ‌రిసారి పెంచిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ప్ర‌కటించిన కొత్త రేట్ల‌లో డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌ను మార్చ‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ కోల్‌క‌తాలో రూ.2322, ముంబైలో రూ.2171, చెన్నైలో రూ.2373కు ల‌భించ‌నున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement